Share News

హౌసింగ్‌ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు?

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:26 PM

గత ప్రభుత్వ హయాంలో నిర్మిం చిన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు పెండింగ్‌ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారని మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీ టీసీలు, సర్పంచ్‌లు అధికారులను ప్రశ్నిం చారు.

హౌసింగ్‌ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు?
మాట్లాడుతున్న ఎంపీడీవో ఫణీంద్రకుమార్‌

-మండల సమావేశంలో అధికారులను ప్రశ్నించిన సభ్యులు

కోటబొమ్మాళి, నవంబరు 25 (ఆంధ్ర జ్యోతి): గత ప్రభుత్వ హయాంలో నిర్మిం చిన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు పెండింగ్‌ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారని మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీ టీసీలు, సర్పంచ్‌లు అధికారులను ప్రశ్నిం చారు. మంగళవారం స్థానిక మండల పరి షత్‌ కార్యాలయంలో ఎంపీడీవో కె.ఫణీంద్ర కుమార్‌ ఆధ్వర్యంలో, ఎంపీపీ రోణంకి ఉమా మల్లే శ్వరరావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామాల్లో ఇల్లు, ఇంటి స్థలం లేనివారికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని, అలాంటి వారు ఈనెల 30లోపు గ్రామీణ ఆవాస్‌ యోజన పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని గృహనిర్మాణ శాఖ అధికారులు కోరారు. దీనిపై పలువురు సభ్యులు మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది ఇళ్లు నిర్మించుకున్నారని, కొంతమం దికి బిల్లులు పెడింగ్‌లో ఉన్నాయని, వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అవి ఆన్‌లైన్‌లో నమోదై ఉన్నాయని ప్రభుత ్వం నిధులు మంజూరు చేస్తే లబ్ధిదారుల ఖాతాలో జమవుతాయని అధికారులు తెలిపారు. ఓటర్‌ జాబితాలో భర్తపేరు ఒక వార్డులో, భార్యపేరు మరో వార్డులో నమోదై ఉన్నాయని, వాటిని సరిచేయాలని, శ్రీపురం కూరగాయల మార్కెట్‌ వద్ద రైతులు కూరగాయలను నిల్వచేసు కొనేందుకు శీతల గిడ్డంగి నిర్మించాలని చీపుర్లపా డు ఎంపీటీసీ బొడ్డు అప్పన్న.. డిప్యూటీ తహసీ ల్దార్‌ ప్రసాదరావును కోరారు. ఓటర్ల జాబితాను ఇప్పటికే బీఎల్‌వోలు సరిచేస్తున్నారని, నెలలో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో వైస్‌ ఎంపీపీ దుక్క రోజారాణి, పీఏసీఎస్‌ అధ్యక్షురాలు వెలమల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 11:26 PM