Share News

ఇదేం పని?

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:59 PM

కొద్దిరోజుల కిందట కాశీబుగ్గ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలో అధికారులు ఒక పవర్‌ బోరును ఏర్పాటు చేశారు.

 ఇదేం పని?
రోడ్డును ధ్వంసం చేసిన దృశ్యం

-ప్రైవేట్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌కు ప్రభుత్వ బోరు నుంచి పైపులైన్‌

- దీనికోసం సీసీ రోడ్డు ధ్వంసం

కాశీబుగ్గ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): కొద్దిరోజుల కిందట కాశీబుగ్గ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలో అధికారులు ఒక పవర్‌ బోరును ఏర్పాటు చేశారు. సమీప నివాసితులతో పాటు వ్యాపారులకు ఈబోరు ఎంతగానో ఉప యోగకరంగా ఉండేది. అయితే, మంగళ వారం ఓ ప్రైవేట్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌కు ఈ పవర్‌ బోర్‌ నుంచి పైప్‌లైన్‌ ఏర్పాటు చేసేందుకు కొందరు వ్యక్తులు వీధిలోని సీసీ రోడ్డును ధ్వంసం చేశారు. స్థానికులు ఇదేం పని ప్రశ్నిస్తే వారితో వాగ్వాదానికి దిగారు. రోడ్డును తవ్వడం వల్ల ప్రస్తుతం అక్కడ రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో అడ్డగోలు వ్యవహారాలు నడుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.

Updated Date - Aug 19 , 2025 | 11:59 PM