Share News

రెగ్యులర్‌ వార్డెన్‌ లేకపోతే ఎలా?

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:57 PM

స్థానిక ప్రభుత్వ బీసీ మెట్రిక్‌ బాలుర వసతిగృహాన్ని ఎమ్మెల్యే నడుకు దిటి ఈశ్వరరావు బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రెగ్యులర్‌ వార్డెన్‌ లేకపోతే ఎలా?
విద్యార్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

రణస్థలం, జులై 30(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ బీసీ మెట్రిక్‌ బాలుర వసతిగృహాన్ని ఎమ్మెల్యే నడుకు దిటి ఈశ్వరరావు బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు. అయితే ఇక్కడ వార్డెన్‌ ఎవరని విద్యార్థులను ఎన్‌ఈఆర్‌ అడుగగా ఎక్కువ మంది తెలి యదంటూ సమాధానమిచ్చారు. ఇటీవలు వార్డెన్ల బదిలీ లు జరగ్గా ఇక్కడికి బదిలీ అయిన వ్యక్తి తన పలుకు బడిని ఉపయోగించి డిప్యూటేషన్‌పై కంచిలి మండలం ఎంఎస్‌ పల్లి బీసీ వసతి గృహానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న ఎన్‌ఈఆర్‌ 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచిలి మండ లానికి ఎలా డెప్యుటేషన్‌ వేశారని ఆశ్చర్యపోయి.. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, రెగ్యులర్‌ వార్డెన్‌ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Jul 30 , 2025 | 11:57 PM