సాంబారు పలుచగా ఉంటే ఎలా?
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:54 PM
సాంబారు ఇలా పలుచగా, ఉప్పు తక్కువగా ఉంటే విద్యా ర్థినులు ఎలా ఆహారాన్ని తింటారని ఫుడ్ కమిటీ సభ్యుడు కాంతారావు ప్రశ్నించారు.
గార, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): సాంబారు ఇలా పలుచగా, ఉప్పు తక్కువగా ఉంటే విద్యా ర్థినులు ఎలా ఆహారాన్ని తిం టారని ఫుడ్ కమిటీ సభ్యుడు కాంతారావు ప్రశ్నించారు. బుధవారం రాత్రి శాలిహుం డం కేజీబీవీని ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట గదిలో విద్యార్థినుల కోసం తయారు చేసిన భోజన పదార్థాలను పరి శీలించారు. సాంబారును చూసిన ఆయన ఆశ్చ ర్యం వ్యక్తంచేస్తూ రుచి చూశారు. పలుచగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. రాత్రికి ఎంతమంది విద్యార్థినులకు భోజనం పెడు తున్నారని సిబ్బందిని అడిగారు. 280 మందికి వంటచేసినట్లు వారు తెలుపగా సాంబారు పలచగా ఉండడం ఏమి టని, చిక్కగా రుచిగా ఉండేలా వండి పెట్టాలని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కె.బేబిశ్రీదేవిని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణ యించిన మెనూలో తేడాలుంటే చర్యలు తప్ప వని హెచ్చరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌక ర్యాలను సద్వినియోగం చేసుకుని బాగా చదు వుకోవాలని విద్యార్థినులను కోరారు. ఆయనతో పాటు డీఎస్‌వో సూర్య ప్రకాశరావు, తహసీల్దార్ ఎం.చక్రవర్తి, ఆర్‌ఐ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.