Share News

Youngman missing: మా కుమారుడు ఏమయ్యాడో?

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:47 PM

Concerns of a young man's parents ఉపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లిన తమ కుమారుడు ఏమయ్యా యోడని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా రు. గత నెల 30న ఆ యువకుడు పని చేస్తు న్న కంపెనీలో పేలుడు సంభవించి 40 మంది మృతి చెందారు. అప్పటి నుంచీ వారం రోజులు గా తమ కుమారుడి ఆచూకీ కానీ, క్షేమ సమా చారం కానీ లేదని వాపోతున్నారు.

Youngman missing: మా కుమారుడు ఏమయ్యాడో?
వెంకటేష్‌ (ఫైల్‌)

  • వారం రోజులుగా ఆచూకీ లేదు

  • ఓ యువకుడి తల్లిదండ్రుల ఆందోళన

  • ‘హైదరాబాద్‌’ కంపెనీలోని పేలుడు ఘటనలో మృతి చెంది ఉంటాడని అనుమానం

  • ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి

  • జి.సిగడాం, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లిన తమ కుమారుడు ఏమయ్యా యోడని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా రు. గత నెల 30న ఆ యువకుడు పని చేస్తు న్న కంపెనీలో పేలుడు సంభవించి 40 మంది మృతి చెందారు. అప్పటి నుంచీ వారం రోజులు గా తమ కుమారుడి ఆచూకీ కానీ, క్షేమ సమా చారం కానీ లేదని వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. జి.సిగడాం మండలం పాలఖండ్యాం పం చాయతీ జగన్నాథపురం గ్రామానికి చెందిన గుంటుపల్లి వెంకటేష్‌ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా పాశమైలం సిగాచి కంపెనీలో నాలుగేళ్ల కిందట చేరాడు. తల్లిదండ్రులు చిన్నారావు, పద్మావతి జగన్నాథ పురంలోనే నివాసం ఉంటున్నారు. కాగా, గత నెల 30న సిగాచి కంపెనీలో పేలుడు సంభవించడంతో 40మంది వరకు మృతి చెందారు. ఈ సమాచారాన్ని టీవీలో చూసిన వెంకటేష్‌ తల్లిదండ్రులు, సోదరి అనిత ఆందోళన చెందారు. వెంటనే వెంకటేష్‌కు ఫోన్‌ చేయగా స్పం దన లేకపోవడంతో తండ్రి చిన్నారావు హైదరాబాద్‌ వెళ్లాడు. అక్కడ కంపెనీ లో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో తమ కుమారుడు ఏమయ్యాడోనని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాద సమయంలో డ్యూటీలో ఉన్నట్టు రికార్డులో నమోదైందని, ఆ ప్రమా దంలో మృతి చెంది ఉంటాడేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకూ తమ కుమారుడికి సంబంధించిన సమాచారం లేదని ఆవేదన చెందు తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని వెంకటేష్‌ ఆచూకీ తెలియజేయాలని, ఒకవేళ మృతి చెంది ఉంటే మృతదేహాన్ని అప్పగించాలని వేడుకుంటున్నారు.

Updated Date - Jul 06 , 2025 | 11:47 PM