Share News

నా భర్తకు ఏమైందో?

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:08 AM

Went to Dubai for employment ‘ఉపాధి కోసం నా భర్త సానా రాజేష్‌ పదేళ్ల కిందట దుబాయ్‌ వెళ్లారు. 2019 జూన్‌ వరకు నిత్యం ఫోన్‌లో మాట్లాడేవారు. మా ఖర్చులకు డబ్బులు పంపించేవారు. తర్వాత ఏమైందో.. ఇప్పటివరకు ఆయన నుంచి ఫోన్‌ సమాచారం రాలేదు. ఆరేళ్లుగా ఆయన ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నామ’ని వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామానికి చెందిన సానా ఢిల్లమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

నా భర్తకు ఏమైందో?
భర్త ఆరోగ్యకార్డును చూపిస్తున్న ఢిల్లమ్మ

ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లారు

ఆరేళ్లుగా ఎలాంటి సమాచారం లేదు

ఆచూకీ తెలియజేయాలని భార్య ఢిల్లమ్మ ఆవేదన

వజ్రపుకొత్తూరు, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘ఉపాధి కోసం నా భర్త సానా రాజేష్‌ పదేళ్ల కిందట దుబాయ్‌ వెళ్లారు. 2019 జూన్‌ వరకు నిత్యం ఫోన్‌లో మాట్లాడేవారు. మా ఖర్చులకు డబ్బులు పంపించేవారు. తర్వాత ఏమైందో.. ఇప్పటివరకు ఆయన నుంచి ఫోన్‌ సమాచారం రాలేదు. ఆరేళ్లుగా ఆయన ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నామ’ని వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామానికి చెందిన సానా ఢిల్లమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విలేకరులకు ఆమె గోడు చెప్పుకున్నారు. ‘కూలి చేస్తూ.. కుమార్తెతో కలిసి జీవిస్తున్నాను. గతంలో నా భర్త రాజేష్‌ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవారు. జీతం చాలకపోవడంతో పదేళ్ల కిందట ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లారు. ఫోన్‌లో తరచూ మాట్లాడుతూ.. మా ఖర్చుల కోసం డబ్బులు పంపేవారు. కానీ గత ఆరేళ్ల నుంచి ఆయనకు ఫోన్‌ చేసినా స్విచ్ఛాప్‌ వస్తోంది. ఇన్నాళ్లూ ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారని ఎదురుచూశాం. కానీ ఇంతవరకూ ఎలాంటి క్షేమ సమాచారం లేకపోవడంతో ఏమైందోనని భయాందోళన చెందుతున్నాం. అధికారులు, నాయకులు స్పందించి నా భర్త ఆచూకీ చెప్పాల’ని ఢిల్లమ్మ వేడుకున్నారు.

Updated Date - Sep 06 , 2025 | 12:08 AM