ఖాతాదారులను ఏమార్చి..
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:20 AM
ఏటీఎంల వద్ద ఖాతాదా రులను ఏమార్చి నగదు చోరీ చే స్తున్న ముగ్గురు వ్యక్తులను అరె స్టు చేసినట్టు డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు.
ఏటీఎంల నుంచి సొమ్ము చోరీ
ముగ్గురి అరెస్టు
రూ.5.60 లక్షలు రికవరీ
వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకట అప్పారావు
సోంపేట, ఆగస్టు 5(ఆంధ్ర జ్యోతి): ఏటీఎంల వద్ద ఖాతాదా రులను ఏమార్చి నగదు చోరీ చే స్తున్న ముగ్గురు వ్యక్తులను అరె స్టు చేసినట్టు డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. మంగళవా రం సోంపేటలో డీఎస్పీ విలేకరు లతో మాట్లాడుతూ.. ఒడిశాకు చెందిన దాకాటి హద్య, సింహా చలం సాహు, బురిడి అశోక్ పా త్రో కలిసి దొంగతనాలకు పాల్ప డుతున్నారు. అమాయకులు, నిరక్ష్యరాస్యుల ను లక్ష్యంగా చేసుకొని ఏటీఎంల వద్ద కాపుకాస్తూ.. ఏటీఎం వాడడం తెలియని వారు వస్తే డబ్బులు తీస్తామని చెప్పి వారి నుంచి కార్డు తీసుకొని తొ లుత డబ్బు తీసి ఇచ్చేవారు. ఆ తరువాత వారి వ ద్ద ఉన్న నకిలీ ఏటీఎం కార్డును సదరు వ్యక్తులకు అందించేవారు. ఆ తర్వాత అసలు ఏటీఎం కార్డుతో ఖాతాలో ఉన్న మొత్తాన్ని కాజేసేవారు. ఈ విధం గా శ్రీకాకుళం టౌన్, ఆమదాలవలస, రాజాం, పా తపట్నం, కాశీబుగ్గ, కంచిలి, మందస, కోటబొమ్మా ళి, చీపు రుపల్లి, కశింకోట, ఒడిశాలో చోరీలకు పాల్పడ్డారు. ఇలా వీరు రూ.17,21,240 దొంగలించా రని, అందులో రూ.5,60,000, ఒక ద్విచక్ర వాహనం, ఏటీఎం కార్డులు రికవరీ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ మంగరాజు, ఎస్‌ఐ లవరాజు పాల్గొన్నారు.