ఎంత పెద్ద పుట్టగొడుగో..
ABN , Publish Date - Jun 01 , 2025 | 11:57 PM
సాధారణంగా పుట్టగొడుగులు 10, 15 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి.
పలాస, జూన్ 1(ఆంధ్రజ్యోతి): సాధారణంగా పుట్టగొడుగులు 10, 15 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. కానీ, పలాస పట్టణంలోని చిన్నకళియా పండా తోటలో ఏకంగా అడుగు పొడవు, అడుగున్నర మందం ఉండే భారీ పుట్టగొడుగు అందర్నీ ఆకట్టుకుంటోంది. దీని బరువు కిలో వరకూ ఉండడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్నతిరుపతిగా పేరుగాంచిన ఈ ప్రాంగణంలో ఉన ్న పూలతోటలో ఈ భారీ పుట్టగొడుగు భక్తులకు కనిపించింది. తొలుత వారంతా ఓ తెల్ల బంతిగా భావించారు. దాన్ని పరిశీలించి చూసేసరికి పుట్టగొడుగుగా నిర్ధారించారు. రెండు రోజులు వర్షాలు కురవడంతో నేలచల్లబడంతో పుట్టగొడుగు వెలసింది. ఇది తినడానికి వినియోగపడదని, కేవలం చూసేందుకే అని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.