సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలి
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:44 PM
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమం గా అందాలని, ఈ దిశలో అందరూ పనిచేయాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఆమదాలవలస, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమం గా అందాలని, ఈ దిశలో అందరూ పనిచేయాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తమ్మినేని శారద అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వురు సభ్యులు సమస్యలను ప్రస్తావించారు. ఈక్రాప్ నమో దు సక్రమంగా చేయకుంటే ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బందులు పడతారని, అందువల్ల త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఏవో మెట్ట మోహన్‌రావును ఆదేశించారు. ఎన్ని ఇళ్ల నిర్మాణం జరిగాయో తెలియ జేయాలని ఎమ్మెల్యే కోరగా హౌసింగ్ అధికారి సన్యాసిరావు వద్ద వివరాలు లేక పోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రోణంకి వెంకటరావు, జడ్పీటీసీ బెండి గోవిందరావు తదిత రులు పాల్గొన్నారు.