సీఎం చంద్రబాబుతోనే సంక్షేమం, అభివృద్ధి
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:45 PM
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్య మని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు.
ఆమదాలవలస/బూర్జ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్య మని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. ఆమదాల వలస మండలం శ్రీనివాసాచార్యులపేట, బూర్జ మండలం ఉప్పినివలస గ్రామాల్లో మొంథా తుఫాన్‌తో నష్ట పోయిన చేనేత కార్మికులకు మంగళవారం ప్రభుత్వం మంజూ రు చేసిన 50 కేజీల బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. తుఫాన్ సమయంలో పునరావాస కేంద్రా ల్లో ఉన్న ప్రజలకు పనిలేక నష్టపోయిన మత్స్యకారు లకు నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింద న్నారు. చేనేత కార్మికులు తుఫాన్ వల్ల పనులు కోల్పోయిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసు కువెళ్లగా వారికి కూడా సరుకులు మంజూరు చేసి ఆదుకునేందుకు ముందుకు వచ్చిం దన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామ కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వ ప్రసాద్, కళింగ కార్పొ రేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, జనసేన పార్టీ ఇన్‌చార్జి పేడాడ రామ్మోహన్ రావు, సర్పంచ్‌లు బొడ్డేపల్లి గౌరీపతి, గొండు రమణ, ఎంపిటిసి అన్నెపు భాస్కర రావు, టీడీపీ నేత నూకరాజు, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీవో రోణంకి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.