Share News

వారంరోజులపాటు రథసప్తమి వేడుకలు

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:05 AM

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న రథసప్తమి వేడుకల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయంతీసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని, వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు మూడు రోజులుగా ఉన్న ఉత్సవాలను ఏడు రోజులు నిర్వహించేం దుకు వీలుగా ప్రభుత్వం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది.

వారంరోజులపాటు రథసప్తమి వేడుకలు

శ్రీకాకుళం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న రథసప్తమి వేడుకల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయంతీసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని, వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు మూడు రోజులుగా ఉన్న ఉత్సవాలను ఏడు రోజులు నిర్వహించేం దుకు వీలుగా ప్రభుత్వం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో-291 ప్రకారం రథసప్తమిని రాష్ట్ర పండుగగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న విషయం విదితమే. మూడు రోజుల వ్యవధి లక్షలాది మంది భక్తుల తాకిడికి సరిపోవడం లేదని, ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ దేవదాయశాఖ కమిషనర్‌ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం ఇకపై ఈ వేడుకలను సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు పేరిట ఏడురోజుల పాటు జరిపేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ డాక్టర్‌ ఎం.హరి జవహర్‌ లాల్‌ పేరుతో మంగళవా రం జీవో -513 విడుదలైంది. తాజా ఆదేశాలకు అనుగుణంగా తదుపరి ఏర్పాట్లు, చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ కమిషనర్‌, అరసవల్లి ఆలయ కార్య నిర్వహణాధికారిని ప్రభుత్వం ఆదేశించింది.

గ్రామస్థులు

Updated Date - Dec 31 , 2025 | 12:05 AM