వైసీపీ హయాంలో కార్పొరేషన్ల నిర్వీర్యం
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:38 PM
: వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు. మంగళవారం కాం్యపు కార్యాలయంలో పొందూరు మండలం లోని లోలుగు గ్రామానికి చెందిన సవరి పార్వతి ప్రధానమంత్రి మత్స్యసంపద యోచన కింద మంజూరైన వాహనాన్ని అందజేశారు.

ఆమదాలవలస, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు. మంగళవారం కాం్యపు కార్యాలయంలో పొందూరు మండలం లోని లోలుగు గ్రామానికి చెందిన సవరి పార్వతి ప్రధానమంత్రి మత్స్యసంపద యోచన కింద మంజూరైన వాహనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ రుణ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మళ్లీ కార్పొరేషన్లను పరుగులు పెట్టిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు వై.సత్యంనాయుడు, బి.సురేష్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.