Share News

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:17 AM

High court judges tour న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి అన్నారు. శనివారం శ్రీకాకుళంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్‌ గేదెల తుహిన్‌ కుమార్‌తో కలిసి జిల్లా 7 వ అదనపు న్యాయస్థానాన్ని ప్రారంభించారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
హైకోర్టు న్యాయమూర్తులను సన్మానిస్తున్న అసోసియేషన్‌ ప్రతినిధులు

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్బారెడ్డి

శ్రీకాకుళం లీగల్‌, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి అన్నారు. శనివారం శ్రీకాకుళంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్‌ గేదెల తుహిన్‌ కుమార్‌తో కలిసి జిల్లా 7 వ అదనపు న్యాయస్థానాన్ని ప్రారంభించారు. వారిని జిల్లా బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో పలువురు న్యాయాధికారులు ఘనంగా సన్మానించారు. జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తంగి శివప్రసాద్‌ న్యాయవాదులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కక్షిదారులకు న్యాయాన్ని అందిచడంలో న్యాయవాదుల పాత్ర కీలకమని తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్‌ గేదెల తుహిన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జూనియర్‌ న్యాయవాదులు సీనియర్ల నుంచి ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలని సూచించారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తులను బీసీ న్యాయవాదుల సంఘం, కోర్టు ఉద్యోగస్థుల అసోసియేషన్‌, ప్లీడర్‌ గుమాస్తాల సంఘం సభ్యులు కూడా సన్మానించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి పిట్టా దామోదర్‌, అసోసియేషన్‌ ప్రతినిధులు భవానీ ప్రసాద్‌, కొమ్ము రమణమూర్తి, ఆరంగి అప్పలరాజు, గేదెల వాసుదేవరావు సీనియర్‌ న్యాయవాదులు తర్లాడ రాధాకృష్ణ, పొన్నాడ వేంకట రమణారావు, పుల్లెల సీతారామయ్య, రమణ దయాల్‌, మామిడి క్రాంతి, భైరి దామోదరరావు వాన కృష్ణచంద్‌, ఆగూరు ఉమామహేశ్వర రావు, పేరూరి నాగేశ్వరరావు మహిళా న్యాయవాదులు గురుగుబిల్లి వనజాక్షి, కొఠీ సత్యవాణి, పైడి అన్నపూర్ణ, శాంతి కుమారి, కుసుమ పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2025 | 12:17 AM