Share News

ఎర్రన్న ఆశయ సాధనకు కృషి చేస్తాం

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:13 AM

Yarrannayudu's 13th death anniversary దివంగత నేత, కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆశయసాధనకు కృషి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ఎర్రన్న ఆశయ సాధనకు కృషి చేస్తాం
ఎర్రన్న ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు

కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): దివంగత నేత, కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆశయసాధనకు కృషి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎర్ర న్నాయుడు 13వ వర్ధంతి సందర్భంగా ఆది వారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ లో ఎర్రన్న ఘాట్‌ వద్ద పలువురు నాయ కులు, కుటుంబసభ్యులతో కలిసి నివాళుల ర్పించారు. తొలుత నిమ్మాడలో ఉన్న ఎర్రన్నాయుడు విగ్రహానికి ఆయన సతీ మణి విజయలక్ష్మి, సోదరుడు పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివర ప్రసాద్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఓఎస్‌డీ కింజరాపు ప్రభాకర్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీమంత్రి గౌతు శ్యాం సుందర్‌ శివాజీ, ఎమ్మెల్యే బండారు సత్య నారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ విశ్వ ప్రసాద్‌, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 12:13 AM