రైతులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే బగ్గు
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:08 AM
రైతులకు కూటమి ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటోందని, రైతులు రాయితీపై ఇచ్చిన ఆధునిక యంత్రాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి సూచించారు. గురువారం కుసుమపోలవలసలో శ్రీరామాంజనేయ కిసాన్‌గ్రూప్ సభ్యులకు రాయితీపై మంజూరుచేసిన డ్రోన్ అందచేశారు.
పోలాకి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి):రైతులకు కూటమి ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటోందని, రైతులు రాయితీపై ఇచ్చిన ఆధునిక యంత్రాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి సూచించారు. గురువారం కుసుమపోలవలసలో శ్రీరామాంజనేయ కిసాన్‌గ్రూప్ సభ్యులకు రాయితీపై మంజూరుచేసిన డ్రోన్ అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో రైతులు గ్రూపుగా ఏర్పడి సంబందిత వ్యవసాయ విస్తరణాధికారికి లేదా వ్యవసాయాధికారికి తెలియచేస్తే డ్రోన్‌తో పాటు వ్యవసాయ పరికరాలను రాయితీ ధరలపై అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో బగ్గు అర్చన, ఎంవీనాయుడు, బైరి భాస్కరరావు, తర్రలక్ష్మీనారాయణ, బొర అప్పలరాజు, కూనరాంబాబు, బైరిఅచ్చెంనాయుడు పాల్గొన్నారు.