బాధితులకు అండగా ఉంటాం
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:55 PM
మొంథా తుఫాన్ నేపథ్యంలో మెంటాడ పంచా యతీ పరిధిలోని పాదాల చెరువు పొంగింది. దీంతో చెరువుకు సమీపంలో ఉన్న 12 పూరిళ్లు నీట మునిగాయి. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ కలి శెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు బుధవారం బాధితులను పరామర్శించారు.
రణస్థలం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ నేపథ్యంలో మెంటాడ పంచా యతీ పరిధిలోని పాదాల చెరువు పొంగింది. దీంతో చెరువుకు సమీపంలో ఉన్న 12 పూరిళ్లు నీట మునిగాయి. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ కలి శెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు బుధవారం బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చా రు. బాధితులకు పునరావాస కేంద్రా నికి తరలించారు. ఈదురు గాలులకు బీసీ బాలు రు వసతి గృహం వద్ద చెట్టు నేలకొరిగింది, తహ సీల్దార్ ఎస్.కిరణ్ కుమార్, ఎస్‌ఐ ఎస్.చిరంజీవి, వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టాలను పరిశీలించారు.