రైతులకు అండగా నిలబడతాం
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:54 PM
వ్యవసాయ యాంత్రీకరణతో రైతుకు పనిభారం తగ్గి అధిక లాభాలు సాధించవచ్చని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.ప్రభుత్వం రైతులకు అండగా నిల బడుతుందని చెప్పారు.
కంచిలి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ యాంత్రీకరణతో రైతుకు పనిభారం తగ్గి అధిక లాభాలు సాధించవచ్చని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.ప్రభుత్వం రైతులకు అండగా నిల బడుతుందని చెప్పారు. ఆదివారం కంచిలి మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూ.1.50కోట్ల విలువ చేసే 236 వివిధ యంత్ర పరికరాలు పవర్ టిల్లర్లు, పవర్ వీడర్లు, బాటరీ స్పేయర్లు, దుక్కియంత్రాలు పరికరాలను రూ.37.2లక్షల రాయితీపై రైతులకు అందజేశారు. కార్య క్రమంలో ప్రభుత్వవిప్ బెందాళం అశోక్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌పుండ్కర్, జేసీ ఫర్మానా అహ్మద్ ఖాన్,ఆర్డీవో వెంకటేష్, జిల్లా వ్యవసాఽయాధికారి కె. త్రినాథస్వామి, డీఎస్పీ వెంకటప్పారావు, సీఐ మంగరాజు, జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, ఇచ్ఛాపురం ఏఎంసీ చైర్మన్ బి.మణిచంద్రప్రకాష్ పాల్గొన్నారు.
ఫసోంపేట, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి):ప్రభుత్వం వ్యవసాయరంగా నికి అధిక ప్రాధాన్యతఇస్తోందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఆదివారం సోంపేటలో రూ.60లక్షల రూర్బన్ మిషన్ నిధులతో నిర్మించిన వ్యవసాయ గోదామును ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ప్రారంభించారు.
ఫఇచ్ఛాఫురం,ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి):నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఇచ్ఛాపు రంలో అన్నిశాఖల అధికారులతో సమీక్షించారు. ఏఐఐబీ ప్రాజెక్ట్ ద్వారా కొత్తగా రూ.60కోట్లు మంజూరయ్యాయని, ఈ నిధులతో ప్రాజెక్ట్ పూర్త వుతుందని, దీంతో 23వార్డుల ప్రజలకు, ప్రధానంగా 1,2,3 వార్డుల ప్రజ లకు తాగునీందుతుందని ప్రభుత్వవిప్ బెందాళం అశోక్ తెలిపారు. అనంతరం నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతిపత్రాలు అందజేశారు. కాగా 11వవార్డులో ఎంపీ నిధుల్షలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజచేశారు. వార్డులో తాగునీటి సమస్యపై కౌన్సిలర్ ఆశి లీలారాణి, మహిళలు మం త్రికి వినతిపత్రం అందజేశారు.మునిసిపాలిటీలో ప్రధాన సమస్యలు పరిష్క రించాలని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరిరాజు రామ్మోహన్‌నా యుడుకు వినతిపత్రం అందజేశారు