రిటైర్డ్ పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:32 PM
రిటైర్డ్ పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని, రిటైర్మెంట్, డెత్ బెనిఫిట్స్ సకాలంలో అందించేందుకు ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి అన్నారు.
శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని, రిటైర్మెంట్, డెత్ బెనిఫిట్స్ సకాలంలో అందించేందుకు ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి అన్నారు. ఉద్యోగ విరమణ, సర్వీసులో ఉంటూ మృతి చెందిన పోలీసులు, హోంగార్డుల కుటుంబ సభ్యులు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలపై మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్షించారు. పోలీస్ కుటుంబాలకు భద్రత, జీపీఎఫ్, ఏసీజీఎల్‌ఐ, విడో, కార్పస్ ఫండ్, అడిషనల్ కార్పస్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్, స్కీమ్, లీవ్ ఎన్‌క్యాష్ మెంట్ నగదు వంటివి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలతో పాటు కారుణ్య నియామకాలు, వ్యక్తిగతమైన సమస్యలను సంబంధిత అధికారులు ఎస్పీకి వివరిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బెనిఫిట్స్‌కి సరైన ధ్రువపత్రాలు పోలీస్ కార్యాలయంలో అందించాలన్నారు. విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాల తో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు ప్రస్తుత పరిస్థితిని కార్యాలయ సిబ్బం దిని అడిగి తెలుసుకున్నారు. తక్షణం తగు చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. కార్య క్రమంలో ఏఎస్సీ కేవీ రమణ, పరిపాలనాధికారి సీహెచ్ గోపీనాథ్, ఏఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, ఆర్‌ఐలు కేవీ నరసింగరావు, శంకర్ ప్రసాద్, సహాయ పరిపాలనాధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.