దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తాం
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:10 AM
దివ్యాంగులు తమ పింఛన్లు రద్ద య్యాయని ఆందోళన పడొద్దని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీ సుకువెళ్లి పరిష్కరి స్తామని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.
ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులు తమ పింఛన్లు రద్ద య్యాయని ఆందోళన పడొద్దని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీ సుకువెళ్లి పరిష్కరి స్తామని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్భార్ నిర్వహించారు. తమ పింఛన్లు రద్దు చే శారని, పునరుద్ధరించాలని కోరుతూ పలువురు దివ్యాంగులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆమె స్పందిస్తూ కలెక్టర్‌తో ఫోన్ మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. అలాగే సక్రమంగా ఎరువులు అందడం లేదని రైతులు ఆమె దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమె వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడారు. మొత్తం 39 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు వాటిని పంపించి పరిష్కరించాలని కోరారు.