తాగునీటి సమస్య పరిష్కరిస్తాం: సీఈవో
ABN , Publish Date - May 15 , 2025 | 11:17 PM
దబ్బపాడు గ్రామస్థుల తాగునీటి సమస్యను నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని జడ్పీ సీఈవో ఎల్‌ఎన్‌వీ శ్రీధర్‌రాజు తెలిపారు. వంశధారనది చెంతనేఉన్నా తాగునీటికి ఇబ్బందులుపడుతుండడంతో గురువారం ఆర్‌డబ్ల్యూఎస్ అధికా రులతో కలిసి వచ్చారు.
ఎల్.ఎన్.పేట, మే 15(ఆంధ్రజ్యోతి) దబ్బపాడు గ్రామస్థుల తాగునీటి సమస్యను నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని జడ్పీ సీఈవో ఎల్‌ఎన్‌వీ శ్రీధర్‌రాజు తెలిపారు. వంశధారనది చెంతనేఉన్నా తాగునీటికి ఇబ్బందులుపడుతుండడంతో గురువారం ఆర్‌డబ్ల్యూఎస్ అధికా రులతో కలిసి వచ్చారు. ఈసందర్భంగా గ్రామస్థులతో మాట్లాడి తాగునీటి సమస్యను అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీనర్సుపేట మెగారక్షితనీటి పఽథకంద్వారా గతంలో గ్రామానికి తాగునీరు వచ్చేదని, వేసవి ప్రారంభమైన తర్వాత మెగా రక్షిత మంచినీటి పఽథకం ద్వారా తాగునీరు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. కుళాయిల ద్వారా నీరురాకపోవడంతో వంశధారనదిలో చెలమల్లో నీటిని సేకరిస్తున్నామని చెప్పారు. దీంతో గ్రామానికి తాగునీటి సమస్యలేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను సీఈవో కోరారు. కార్య క్రమంలో ఎంపీడీవో పి. శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ శ్రీనివాసులు, జేఈ రాజేశ్వరి, సర ్పంచ్ ఎం.మోహిని పాల్గొన్నారు.