రైల్వే సమస్యలను పరిష్కరిస్తాం
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:31 PM
ఇచ్ఛాపురం, జాడు పూడి, బారువ, సోంపేట, మందస, పలాస రైల్వే స్టేషన్‌లలో ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని రైల్వే జీఎం పరమేష్ పంక్వజ్ హామీ ఇచ్చినట్లు జడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు శ్రీనివాస్ రౌలో తెలిపారు.
ఇచ్ఛాపురం,ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం, జాడు పూడి, బారువ, సోంపేట, మందస, పలాస రైల్వే స్టేషన్‌లలో ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని రైల్వే జీఎం పరమేష్ పంక్వజ్ హామీ ఇచ్చినట్లు జడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు శ్రీనివాస్ రౌలో తెలిపారు. శుక్రవారం ఒడిశా రాష్ట్రం భువ నేశ్వర్‌లోని ఈస్ట్‌కోస్ట్ రైల్వే జడ్‌ఆర్‌యూసీసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లలో ప్రధాన రైళ్ల హాల్టింగ్, ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు, లిఫ్ట్‌లు, ర్యాంపులు, వెయిటింగ్ షెడ్ల నిర్మాణాలపై వినతిపత్రాలు అందించారు. చర్యలు తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చారు.
బారువలో పాసింజర్ హాల్ట్ ఇవ్వాలి
సోంపేట, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): బారువ రైల్వే స్టేషన్‌లో పాసింజర్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని టీడీపీ నాయ కులు కోరారు. ఈ మేరకు భువనేశ్వర్‌లో జరిగిన సమా వేశంలో రైల్వే జనరల్ మేనేజర్‌కు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి వినతిపత్రం అందించారు. జీఎంను కలిసిన వారిలో టీడీపీ మండల అధ్యక్షుడు మడ్డు కుమార్, రాష్ట్ర కార్యదర్శి సూరాడ చంద్రమోహన్, రైల్వే సాధన కమిటీ సభ్యుడు రత్నాల శ్రీనివాసరావు ఉన్నారు.