సమస్యలన్నీ పరిష్కరిస్తాం
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:15 AM
ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పేర్కొన్నారు.
గుమ్మలక్ష్మీపురం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పేర్కొన్నారు. బుధవారం గుమ్మలక్ష్మీపురంలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో రహదారులు, గృహాలు, పింఛన్లు, మంచినీటి సరఫరా సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు.
అర్హులందరికీ పథకాలు అందాలి
సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పేర్కొన్నారు.గుమ్మలక్ష్మీపురంలోని క్యాంప్‌కార్యాలయంలో గరుగుబిల్లి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ మండలాధ్యక్షుడు మరడాన నారాయ ణస్వామినా యుడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు. రాను న్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలవాలన్నారు.