Share News

అర్హులందరికీ పింఛన్‌ అందిస్తాం

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:23 AM

అర్హులైన దివ్యాంగులందరికీ పింఛన్‌ అందిస్తామని మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు అన్నారు.

అర్హులందరికీ పింఛన్‌ అందిస్తాం
అర్జీదారు సమస్య తెలుసుకుంటున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): అర్హులైన దివ్యాంగులందరికీ పింఛన్‌ అందిస్తామని మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు అన్నారు. గురువారం నిమ్మా డలోని తన క్యాంపు కార్యాలయంలో ప్ర జాదర్భార్‌ నిర్వహించారు. తమ పింఛ న్లను పునః పరిశీలన పేరుతో తొలగిస్తు న్నారని పలువురు దివ్యాంగులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వ హ యాంలో అనర్హులైన వైసీపీ నాయకులు తమ కుటుంబ సభ్యులకు దివ్యాంగ పింఛన్లు ఇప్పించుకున్నారని, పునఃపరిశీలనలో అటువంటి అనర్హులను మాత్రమే తొలగిస్తామని, అర్హులైన వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నా రు. అలాగే ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వర పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని అధికా రులను ఆదేశించారు. పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, నాలుగు మండలాల ముఖ్య నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అలాగే స్థానిక టీడీపీ కార్యాలయంలో పలువురికి సీఎం సహా యనిధి చెక్కులను మంత్రి అచ్చెనాయుడు అందజేశారు. మొత్తం 110 మందికి రూ.1.50 కోట్లు అందజేసినట్టు మంత్రి తెలిపారు. అలాగే నిమ్మాడ గ్రామంలో గురువారం వ్యవసాయాధికారులు నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. డ్రోన్‌ సాయంతో వరి పంటకు నానో యూరియా, డీఏపీ మందు పించికారీని పరిలించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు జగన్మోహన్‌, కోటబొమ్మాళి, టెక్కలి వ్యవసాయాఽధికారులు ఎస్‌.గోవింధరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2025 | 12:23 AM