Share News

శివారు భూములకు సాగునీరు అందిస్తాం

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:18 AM

శివారు భూముల కు పూర్తి స్థాయిలో సాగునీరు అంది స్తామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

శివారు భూములకు సాగునీరు అందిస్తాం
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ పుండ్కర్‌

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

పలాస, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): శివారు భూముల కు పూర్తి స్థాయిలో సాగునీరు అంది స్తామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. ఈ మేరకు శని వారం పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి అంతరకుడ్డ సమీపంలో ఉన్న వంశధార కాలు వను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివారు భూములకు నీరు వెళ్లాలంటే ఎంత మేర వసరం, ఇంకా ఎన్ని చెరువుల నిం డాల్సి ఉంది అనే అంశంపై వంశధార ఈఈ శేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. అంతరకుడ్డలో ప్రధాన సమస్య వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారని, కల్వర్టును తొలగించి స్లాబ్‌ వేసేలా చర్యలు చేపట్టాలని ప్రజలకు కోరగా మున్సిపల్‌ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అధికారులు రాజశేఖర్‌, మీనాక్షి, నీటి సంఘం అధ్యక్షుడు నిరంజన్‌, టీడీపీ నాయకులు బి.నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 12:18 AM