Share News

drinking water ప్రతి ఇంటికీ తాగునీరందిస్తాం

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:46 PM

drinking water ప్రతి ఇంటికీ తాగునీరందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. స్థానిక ఎల్లమ్మవీధిలో సోమవారం రూ.5 లక్షలతో నిర్మించిన పవర్‌ బోర్‌ను ప్రారంభించారు.

drinking water   ప్రతి ఇంటికీ తాగునీరందిస్తాం
పవర్‌బోర్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటికీ తాగునీరందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. స్థానిక ఎల్లమ్మవీధిలో సోమవారం రూ.5 లక్షలతో నిర్మించిన పవర్‌ బోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. ఉద్దానం రక్షిత నీటి పథకాన్ని పలాస-కాశీబుగ్గ పట్టణానికి రప్పించామని, త్వరలో పనులు పూర్తి చేసి పూర్తిస్థాయిలో నీరంది స్తామన్నారు. ఇప్పటికే మునిసి పాలిటీ నిధులు రూ.63 లక్షలు పైపులైన్ల కోసం ఖర్చు చేస్తున్నా మని, టెండర్లు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్దా నం ట్యాంకు లకు పైపులైన్లను అనుసంధానం చేసి ప్రతిరోజు ఐదు ఎంఎల్‌టీల నీరు ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారన్నారు. దీంతో పాటు అదనంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశామని, ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి నీటి సరఫరా చేస్తామ న్నారు. ప్రభుత్వ ఐటీఐ రోడ్డు, మంకినమ్మ ఆలయం వద్ద అభివృద్ధి పనుల్లో ఆమె పాల్గొన్నారు. కార్యక్ర మంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, బీసీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వర రావుయాదవ్‌, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, మల్లా శ్రీనివాస్‌, టంకాల రవిశంకర్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 11:46 PM