మెరుగైన పునరావాసం కల్పిస్తాం
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:07 AM
నువ్వలరేవు ఉప్పుటేరుపై నిర్మించి న వంతెన నుంచి నువ్వలరేవు వైపు నిర్మిం చనున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో భాగం గా ఇళ్లు కోల్పోయిన వారికి మెరుగైన పున రావాసం కల్పిస్తామని ఎమ్మెల్యే గౌతు శిరీ ష అన్నారు.
ఉప్పుటేరు వంతెన నుంచి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి సహకరించండి
ఎమ్మెల్యే గౌతు శిరీష
నువ్వలరేవు గ్రామస్థులతో సమావేశం
వజ్రపుకొత్తూరు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): నువ్వలరేవు ఉప్పుటేరుపై నిర్మించి న వంతెన నుంచి నువ్వలరేవు వైపు నిర్మిం చనున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో భాగం గా ఇళ్లు కోల్పోయిన వారికి మెరుగైన పున రావాసం కల్పిస్తామని ఎమ్మెల్యే గౌతు శిరీ ష అన్నారు. బుధవారం ఆ గ్రామంలోని బృందావతి ఆలయంలో స్థానిక సర్పంచ్ పూర్ణ అధ్యక్షతన నిర్వాసితులు, గ్రామస్థుల తో పలాస ఆర్డీవో జి.వెంకటేష్‌తో కలిసి ఎమ్మెల్యే గౌతు శిరీష సమావేశమయ్యారు. వంతెన నుంచి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి నిధులు ఉన్నందున గ్రా మస్థులు సహరించాలని కోరారు. అందుకు ప్రభు త్వం అందిస్తున్న సహకారం వివరించారు. అలాగే వంతెన నుంచి అప్రోచ్ రోడ్డు నిర్మాణంతో గ్రామం లో మరిన్ని మౌలిక సదుపాయాలు పెరుగుతాయ న్నారు. ఏడేళ్ల కిందట తన తండ్రి గౌతు శివాజీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.50 కోట్లతో ఉప్పుటేరుపై వంతెన నిర్మాణం చేశారని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రి అప్పల రాజు పట్టించుకోకపోవడంతో పనులు నిలిచిపో యాయన్నారు. ఇప్పుడు ఈ వంతెనకు అప్రోచ్ రోడ్డు నిర్మించి పనులు పూర్తిచేయాలనే తలంపుతో ఉన్నందున గ్రామస్థులు సహకరించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం మరింత పెంచాలని నిర్వాసితులు కోరగా.. ప్రభుత్వ పెద్దల తో మాట్లాడతానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో నిర్వాసితులు తమ ఇళ్లు తొలగింపునకు అంగీకరిం చారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు అందించే ఆర్థిక సాయం, ఇంటి స్థలం కేటాయింపు వివరాలు ఆర్డీవో వెంకటేష్ వివరించారు. నిర్వాసితుల జాబి తాలో ఉన్న వారు రేషన్‌కార్డు, ఆధార్, బ్యాంకు జెరాక్స్‌లు అందిస్తే ఆరు నెలల్లో ఈ పక్రియ పూర్తిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అంత కుముందు గ్రామదేవత బృందావతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ కణితి సురేష్, మాజీ చైర్మన్ దువ్వాడ హేంబాబుచౌదరి, తహసీల్దార్ సీతారామయ్య, ఆర్‌అండ్‌బీ ఏఈఈ జగదీష్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుల్లోజు శశిభూషణ్, మాజీ ఎంపీపీ గొరకల వసంతరావు, మాజీ కో ఆప్షన్ సభ్యులు వెంకటరమణ, నెయ్యల సూర్యనారాయణ, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ విఠల్ పాల్గొన్నారు.