Share News

వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:56 PM

బీసీ సంక్షేమ వసతి గృహాలను ఆధునీకరించి అన్ని మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పిస్తామని బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సత్యనారాయణ తెలిపారు.

వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం
నరసన్నపేట: విద్యార్థులతో మాట్లాడుతున్న సత్యనారాయణ

  • బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సత్యనారాయణ

నరసన్నపేట/ పాతపట్నం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): బీసీ సంక్షేమ వసతి గృహాలను ఆధునీకరించి అన్ని మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పిస్తామని బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం స్థానిక బాలికల వసతిగృహాన్ని ఆయన పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రాష్ట్రంలో అనంతపురం, సింహాచలం వపతిగృహాల్లో 240 మంది చొప్పు న విద్యార్థులకు ఐఐటీపై శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. వసతిగృహ విద్యార్థుల్లో మానసక పరివర్తిన, మనోధైర్యం పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్‌ ఈడీ గడ్డెమ్మ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనురాఽధ పాల్గొన్నారు. అలాగే పాతపట్నం నీలమణిదుర్గ ఆలయాన్ని బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.సత్యనారాయణ ఆదివారం దర్శించు కొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ అక్కంద్ర సన్యాసిరావు, కమిటీ సభ్యులు డి.వెంకటరమణ దేవదాయశాఖ సిబ్బంది సాధారంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

Updated Date - Dec 07 , 2025 | 11:56 PM