బ్యాంక్ బ్రాంచ్‌ను తరలిస్తే ఉద్యమిస్తాం
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:35 PM
మండలంలోని షలంత్రిలో ఉన్న ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌ను తరలిస్తే ఉద్యమిస్తామని గ్రామస్థులు తేల్చిచెప్పారు. ఖాతాదారుల అభ్యర్థన మేరకు డీసీసీబీచైర్మన్ శివ్వాల సూర్య నారాయణ బ్యాంకు ఉన్నతాధికారులకు ప్రజల అభిప్రాయాన్ని వివరించి బ్యాంకును తరలించవద్దని విన్నవించారు.
సరుబుజ్జిలి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని షలంత్రిలో ఉన్న ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌ను తరలిస్తే ఉద్యమిస్తామని గ్రామస్థులు తేల్చిచెప్పారు. ఖాతాదారుల అభ్యర్థన మేరకు డీసీసీబీచైర్మన్ శివ్వాల సూర్య నారాయణ బ్యాంకు ఉన్నతాధికారులకు ప్రజల అభిప్రాయాన్ని వివరించి బ్యాంకును తరలించవద్దని విన్నవించారు. దీంతో మంగళవారం ఇండియన్ బ్యాంకు డిప్యూటీ జోనల్ మేనేజర్ శివకుమార్ ఆధ్వర్యంలో షలంత్రి గ్రామ సచివాలయంఆవరణలో ప్రజాభిప్రాయసేకరణ సభ నిర్వహించారు. గ్రామ సభకు హాజరైన ఖాతాదారులు బ్యాంక్‌ను తరలిస్తే ఉద్యమిస్తామని హెచ్చ రించారు. ఒకవేళ తమ అభిప్రాయాన్ని గౌరవించకుండా బ్యాంకు తరలిస్తే బ్యాంకులో ఉన్న ఖాతాలను రద్దు చేసుకుని లావాదేవీలను నిలిపివేస్తామని బ్యాంకు అధికారులను హెచ్చరించారు. స్థానిక బ్యాంకు మేనజర్ మహేంద్ర, వీఆర్వో, గ్రామ సచివాలయం ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.