protest environment: ఉద్దానంలో విధ్వంసం సృష్టిస్తే సహించం
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:48 PM
uddanam protest పచ్చటి ఉద్దానంలో కార్గో ఎయిర్‌పోర్టు పేరుతో విధ్వంసం సృష్టిస్తే సహించేదిలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మంగళవారం మందస మండలంలోని ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రతిపాదిత గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఎం.గంగువాడ నుంచి రాంపురం వరకు ర్యాలీ నిర్వహించారు.
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
హరిపురం, ఆగష్టు12 (ఆంధ్రజ్యోతి): పచ్చటి ఉద్దానంలో కార్గో ఎయిర్‌పోర్టు పేరుతో విధ్వంసం సృష్టిస్తే సహించేదిలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మంగళవారం మందస మండలంలోని ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రతిపాదిత గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఎం.గంగువాడ నుంచి రాంపురం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎయిర్‌పోర్టు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు అధ్యక్షతన రాంపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఎయిర్‌పోర్టు పేరుతో పచ్చని జీడి, కొబ్బరి తొటలు నాశనం చేయవద్దు. బలవంతపు భూ సేకరనణ నిలిపివేయాలి. ఢిల్లీ వంటి పట్టణంలో కేవలం 150 ఎకరాల్లో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే.. ఇక్కడ 1400 ఎకరాలు సేకరించి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తాం. కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు.. ఉద్దానం అభివృద్ధి కోరుకోవాల’ని నారాయణ హితువు పలికారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవింరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు వంకల మాధవరావు, కె.మోహనరావు, బత్తిని లక్ష్మణ్, పి.కుసుమ, అరుణక్క, అజయ్‌కుమార్, శ్రీదేవి, బాలకృష్ణ, రుషి పాల్గొన్నారు.