సంక్రాంతీ తర్వాత మూలపేటను తరలిస్తాం
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:22 AM
Plans to move to a rehabilitation colony పోర్టు పునరావాస గ్రామమైన మూలపేటను సంక్రాంత్రి తర్వాత నౌపడ పునరావస కాలనీకి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు.
ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి
ఆర్‌అండ్‌ఆర్ పనుల జాప్యంపై ఆగ్రహం
సంతబొమ్మాళి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): పోర్టు పునరావాస గ్రామమైన మూలపేటను సంక్రాంత్రి తర్వాత నౌపడ పునరావస కాలనీకి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు. గురువారం సంతబొమ్మాళి మండలం నౌపడలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో చేపడుతున్న పనులను పరిశీలించారు. పనుల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల, పంచాయతీ కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రాల భవనాల పనులు ప్రారంభించడానికి ఇంకెంత సమయం కావాలని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. వారం రోజుల్లో ఆర్‌అండ్ ఆర్ కాలనీలో అన్ని పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. ఇంటింటికి కుళాయి పాయింట్లు, తాగునీటి ట్యాంక్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రామకృష్ణకు సూచించారు. మూలపేటలో 75మంది నిరుపేదలను గుర్తించామని వారందరికీ ఉచితంగా ఇంటి నిర్మాణ సామగ్రి అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాలనీలో నాలుగు చెరువులను అభివృధ్ది చేస్తామని, కాలనీ వాసులకు నౌపడలో శశ్మానవాటిక పనులు త్వరలోనే చేపడతామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హేమసుందర్, ఎంపీడీవో పి.జయంత్ ప్రసాద్, మండల ఇంనీరింగ్ అధికారి అంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.