పంట నష్టంపై అధికారులకు తెలియజేస్తాం
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:53 PM
:పాతపట్నం పరిధిలో ఇటీవల కురిసిన వర్షా లకు దెబ్బతిన్న పంట నష్టం అంచనా వేసి ఉన్నతాధికారులకు తెలియజేయనున్నట్లు వ్యవసాధికారులు తెలిపారు.
పాతపట్నం, సెప్టెంబరు9(ఆంధ్రజ్యోతి):పాతపట్నం పరిధిలో ఇటీవల కురిసిన వర్షా లకు దెబ్బతిన్న పంట నష్టం అంచనా వేసి ఉన్నతాధికారులకు తెలియజేయనున్నట్లు వ్యవసాధికారులు తెలిపారు. మంగళవారం పాతపట్నంలోని నీలకంఠేశ్వరుని ఆలయం వెనుకభాగంలో గుమ్మగెడ్డ పరీవాహక ప్రాంతంలో ముంపుకుగురైన పంటపొలాలను వ్యవసాయశాఖ టెక్కలి ఏడీఏ జగన్మోహనరావు, శాస్త్రవేత్త సైంటిస్టు మధు కుమార్ పరిశీలించారు. వీరివెంట ఏవో కిరణవాణి, ఏఈవో భారతి, వీఏఏ ఉన్నారు.