భూములు ఆక్రమిస్తే పోరాడుతాం
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:12 AM
గిరిజనుల భూములు ఆక్రమిస్తే పోరాటం తప్పదని గిరిజన శక్తి సంక్షేమసంఘం సభ్యులు తెలిపారు.
మందస,అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): గిరిజనుల భూములు ఆక్రమిస్తే పోరాటం తప్పదని గిరిజన శక్తి సంక్షేమసంఘం సభ్యులు తెలిపారు. గురువారం మందస తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన శక్తి సంక్షేమ సంఘం సభ్యులు సవర నర్సింగరావు, సవర హరికృష్ణ మాట్లాడారు. మందస మండలంలోని కొండలోగాం పంచాయతీ చాపరాయికాలనీ గ్రామ పరిధి లో ఈ భూములను ఆక్రమణలకుపాల్పడుతున్నారని వాపోయారు.ఈవిషయంపై రెవెన్యూ అధికారులకు తెలిపినా సరైన స్పందించడంలేదని తెలిపారు. న్యాయం జరగకపోతే పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో గిరిజనశక్తి సంఘ సభ్యులు గోపాల్, మాజీ సర్పంచ్ సవర జగ్గారావు, సవర జ్యోతి, సవర కుమారి, ఎపీ రైతు కూలీ సంఘం కార్యదర్శి కోనేరు రమేష్ పాల్గొన్నారు.