Share News

ఇంటిగ్రేటెడ్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌గా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Oct 17 , 2025 | 12:36 AM

Nagababu inspected the Srikakulam RTC complex. శ్రీకాకుళంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఇంటిగ్రేటెడ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తెలిపారు. గతంలో జిల్లా పర్యటనలో అందిన ఫిర్యాదు మేరకు గురువారం ఎమ్మెల్సీ నాగబాబు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పరిశీలించారు.

ఇంటిగ్రేటెడ్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌గా తీర్చిదిద్దుతాం
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నిలిచిన మురుగునీటిని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు

20 ఏళ్లుగా సమస్య పరిష్కారం కాకపోవడం అన్యాయం

ఎమ్మెల్సీ నాగబాబు

శ్రీకాకుళం అర్బన్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఇంటిగ్రేటెడ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తెలిపారు. గతంలో జిల్లా పర్యటనలో అందిన ఫిర్యాదు మేరకు గురువారం ఎమ్మెల్సీ నాగబాబు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘శ్రీకాకుళం నగరం నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్‌ చిన్నపాటి వర్షానికే నీటమునిగిపోవడం విచారకరం. ఈ సమస్య 20 ఏళ్లుగా ఉన్నా.. పరిష్కారం కాకపోకవడం అన్యాయం. గత పాలకులు కాంప్లెక్స్‌ సమస్యను కనీస స్థాయిలో పట్టించుకోలేదు. కాంప్లెక్స్‌ సమస్యపై కౌన్సిల్‌లో మంత్రులను అడిగా. సుమారు 60వేలమంది ప్రయాణిస్తున్నారని, బస్టాండ్‌లో వర్షాకాలం వస్తే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కనీసం బస్టాండ్‌ను ఎత్తు చేస్తే సరిపోతుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ బస్టాండ్‌గా మారిస్తే ఇప్పుడున్న 25 ఫ్లాట్‌ఫారాల నుంచి 45 ఫ్లాట్‌ఫారాలుగా మార్చవచ్చు. ఆర్టీసీకి కమర్షియల్‌గా ఆదాయం మరింత పెరుగుతుంది. ఈ వియయంపై త్వరలో మంత్రులతో చర్చించి సమస్యను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనిపై చాలా ప్రతిపాదనలు ఉన్నాయి. స్ర్తీ శక్తి పథకం ద్వారా బస్సుల్లో పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు చేపడతామ’ని తెలిపారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ కొరికాన రవికుమార్‌, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌, నియోజకవర్గ ఇన్‌చార్జిలు గేదెల చైతన్య, పేడాడ రామ్మోహన్‌, దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2025 | 12:36 AM