ఎందువను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:54 PM
పురాతన దేవాలయాలు ఉన్న ఎందువ గ్రామాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) హామీ ఇచ్చారు.
- ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్
జి.సిగడాం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పురాతన దేవాలయాలు ఉన్న ఎందువ గ్రామాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) హామీ ఇచ్చారు. సోమవారం ఎందువలో నిర్వహించిన నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంద న్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించటమే తమ లక్ష్యమన్నారు. నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఎందువలో రహదారుల నిర్మాణానికి రూ.1.90 కోట్లు, తాగునీరు అందించేందుకు రూ.63 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీసీ రోడ్డును ఆయన ప్రారంబించారు. ముందుగా నడిమివలసలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, పీఏసీఎస్ అధ్యక్షుడు బెవర జగన్నాథరావు, కూటమి నాయకులు కుమరాపు రవికుమార్, పైల విష్ణుమూర్తి, మీసాల రవికుమార్, సర్పంచ్ అల్లు జోగినాయుడు, తదితరులు పాల్గొన్నారు.