Share News

కృష్ణాపురంలో కిడ్నీవ్యాధి పరీక్షలు చేస్తాం

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:56 PM

కృష్ణాపురం గ్రామంలో కిడ్నీవ్యాధి నిర్ధారణకు రక్తపరీక్షలతో పాటు సంపూర్ణ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ అనిత తెలిపారు.

కృష్ణాపురంలో కిడ్నీవ్యాధి పరీక్షలు చేస్తాం
కృష్ణాపురం గ్రామంలో కిడ్నీవ్యాధి నిర్ధారణకు రక్తపరీక్షలతో పాటు సంపూర్ణ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ అనిత తెలిపారు.

- డీఎంహెచ్‌వో అనిత

పొందూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కృష్ణాపురం గ్రామంలో కిడ్నీవ్యాధి నిర్ధారణకు రక్తపరీక్షలతో పాటు సంపూర్ణ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ అనిత తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘ఆ గ్రామానికి ఏమైౖంది’ కథనంపై ఆమె స్పందించారు. ఈ మేరకు బుధవారం కృష్ణాపురంలో వైద్య సిబ్బందితో కలిసి ఆమె సర్వే నిర్వహించారు. గ్రామంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణాలు తెలుసుకోవాలని, బాధితులను గుర్తించడానికి వైద్య పరీక్షలు నిర్వహించాలని గ్రామస్థులు కోరారు. గ్రామంలో తాగునీటి వనరులను పరీక్షిస్తామని, ఇతర కారణాలపైనా దృష్టి పెడతామని ఆమె హామీ ఇచ్చారు. వ్యాధి అదుపులోకి వచ్చేంత వరకు వైద్య శిబిరాలు నిర్వహించాలని తాడివలస పీహెచ్‌సీ సిబ్బందిని ఆదేశించారు.

Updated Date - Oct 15 , 2025 | 11:56 PM