డ్రైనేజీ వ్యవస్థ రూపురేఖలు మారుస్తాం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:03 AM
: నగరంలోని డ్రైనేజీ వ్యవస్థల రూపురేఖలను మారుస్తామని, దీనికోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు.
అరసవల్లి జూలై 29(ఆంధ్రజ్యోతి): నగరంలోని డ్రైనేజీ వ్యవస్థల రూపురేఖలను మారుస్తామని, దీనికోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళంలోని దండివీధి, సీబీ రోడ్డు పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను పరి శీలించారు.కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, జంగమ సాధికార సమితి డైరెక్టర్ విభూది సూరిబాబు, నక్క శంకరరావు పాల్గొన్నారు.