Share News

ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తాం

ABN , Publish Date - Nov 01 , 2025 | 11:44 PM

ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తాం
నరేంద్రపురం జంక్షన్‌ వద్ద వివిధ అభివృద్ధి పనుల కోసం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి అచ్చెన్నాయుడు

- రైతులందరినీ ఆదుకుంటాం

- మంత్రి అచ్చెన్నాయుడు

నందిగాం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నరేంద్రపురంలో నేలకొరిగిన వరి పైరును వ్యవసాయశాఖ జేడీ కె.త్రినాథస్వామి, టెక్కలి ఏడీఏ కె.జగన్మోహనరావుతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. మొంథా తుఫాన్‌తో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి పేర్కొన్నారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేశారు. రూ.1.97కోట్లతో చేపట్టనున్న నరేంద్రపురం జంక్షన్‌-వల్లభరా యుడుపాడు బీటీ రహదారి, రూ.1.20కోట్లతో నిర్మించనున్న వల్లభరాయుడు పాడు-దొడ్లరామచంద్రాపురం రహదారి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రూ.1.20కోట్లతో నిర్మించిన పాలూరు జంక్షన్‌-కొండపేట జంక్షన్‌ వయా మొజ్జువాడ బీటీ రహదారి, రూ.85లక్షలతో నిర్మించిన వల్లభ రాయుడుపాడు-పాతటెక్కలి బీటీ రోడ్డును ప్రారంభించారు. కార్యక్రమంలో పలాస ఆర్డీవో జి.వెంకటేష్‌, అధికారులు పి.సోమేశ్వరరావు, కుమార్‌ పట్నాయక్‌, పి.శ్రీకాంత్‌వర్మ, నాగరాజు, పి.సంతోష్‌కుమార్‌, కె.అంజిత్‌కుమార్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2025 | 11:44 PM