త్వరలో కొత్త డీసీసీని ప్రకటిస్తాం
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:50 PM
కేంద్రంలోని బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం ఆరోపించారు. ఈవిషయంపై అక్టోబరు 15వ తేదీ వరకు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు.
అరసవల్లి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి) కేంద్రంలోని బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం ఆరోపించారు. ఈవిషయంపై అక్టోబరు 15వ తేదీ వరకు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. త్వరలో కొత్త డీసీసీని ప్రకటిస్తామని పేర్కొ న్నారు. గురువారం శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్‌భవన్‌లో కాంగ్రెస్ కార్య కర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి, రామ్మోహనరావు, సనపల అన్నాజీరావు, కోతమధుసూధనరావు, పూడి కిరణ్‌కుమార్, నగర అధ్యక్షుడు రెల్ల సురేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మధుసూదనరావు, అధికార ప్రతినిధి చింతాడ దిలీప్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కేవీఎల్‌ఎన్ ఈశ్వరి పాల్గొన్నారు.