టెక్నాలజీ సాయంతో చోరీని ఛేదించాం
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:37 AM
టెక్నాలజీ సాయంతో చోరీకి గురైన నాలుగు బైక్‌లు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు.
పొందూరు, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): టెక్నాలజీ సాయంతో చోరీకి గురైన నాలుగు బైక్‌లు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. గురువారం పొందూరు స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడు తూ వివరాలు వెల్లడించారు. బైక్‌లు చోరీకి గురైనట్టు అందిన ఫిర్యాదు మేరకు సాంకేతికతను వినియోగించుకుని పొందూరు ఎస్‌ఐ వి.సత్యనారాయణ, సిబ్బంది తో కలిసి చోరీకి గురైన వాహనాలు వినియోగిస్తున్నవారిని గుర్తించి ఆరా తీశారు. మూడు బైక్‌లు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న బొమ్మలాట మోహ నరావు, ఒక బైక్ బొమ్మలాట ఢిల్లీ, ఆటోను తోట శ్రీను చోరీ చేసినట్లు గుర్తించారు. ప్రస్తు తం వాహనాలను బొమ్మలాట ఢిల్లీ నుంచి స్వాధీనం చేసుకున్నారు. చోరీని ఛేదిం చడంలో ప్రతిభ చూపిన ఎస్‌ఐ సత్యనారాయణను, సిబ్బందిని డీఎస్పీ అభినం దించారు. త్వరలోనే రివార్డు ప్రకటించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ పి.సత్యనారాయణ, ఎస్‌ఐ సత్యనారాయణ, మోహిని తదితరులు పాల్గొన్నారు.
కిల్లోయిలో దొంగల హల్‌చల్
రెండు చోట్ల చోరీ
హరిపురం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): మందస మండలం ఏజెన్సీ ప్రాంతం లోని కిల్లోయి గ్రామంలో బుఽధవారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. ఒక కిరాణా దుకాణం, ఒక మినీ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. నల్ల శంకరరావు కిరణాదుకాణం పెట్టి జీవనం సాగిస్తుండగా.. నాగ రమేష్ ఏపీజీవీబీ మినీ ఏటీఎం ఏర్పాటు చేసి జీవనం పొందుతున్నారు. రాత్రి దుకాణం తలుపులు వేసి వెళ్లిపోయారు. గురువారం ఉదయం దుకాణం తెరిచేందుకు వెళ్లేసరికి తలుపులు తెరిచి ఉండడంతో లబోదిబోమన్నారు. కిరణా దుకాణంలో ఉంచిన సుమారు రూ.లక్ష నగదు, మినీ బ్యాంకు ఏటీఎంలో రూ.30వేలు నగదు, వివిధ ఎలక్ర్టానిక్ పరికరాలు చోరికిగురయ్యాయి. సమాచారం అందుకున్న మందస ఎస్‌ఐ కె.కృష్ణ ప్రసాద్ ఘటనా స్థలాన్ని సందర్శించి క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరిం చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.