Share News

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:35 PM

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి
మాట్లాడుతున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

ఎచ్చెర్ల, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. చిలకపాలెంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలతో సమన్వ యంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అభివృద్ధి, సంక్షే మాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవే రుస్తూ మంచి పాలన అందిస్తున్నట్టు తెలిపారు. కార్య క్రమం లో కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అన్నెపు భువనేశ్వరరావు, పార్టీ నేతలు లంక శ్యామ్‌, వావిలపల్లి రామకృష్ణ, కుమరాపు రవికుమార్‌, పైడి ముఖ లింగం, పంచిరెడ్డి కృష్ణారావు, మెండ రాజారావు, గట్టెం శివ రామ్‌ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (కలిశెట్టి)

Updated Date - Nov 18 , 2025 | 11:35 PM