రైతులకు మేలు చేసేలా పాటుపడాలి: ఎమ్మెల్యే అశోక్
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:58 PM
మార్కెట్ యార్డు ద్వారా రైతులకు మేలు చేసేలా కృషి చేయాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బి.అశోక్ ఈన్నారు.
కవిటి, జూలై 30(ఆంధ్రజ్యోతి): మార్కెట్ యార్డు ద్వారా రైతులకు మేలు చేసేలా కృషి చేయాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బి.అశోక్ ఈన్నారు. గొర్లెపాడు వద్ద బుధవారం ఇచ్ఛాపురం మార్కెట్ యార్డు చైర్మన్ మణిచంద్ర ప్రకాష్, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని యత్నిస్తోందన్నారు. ఈ మేరకు మార్కెట్ యార్డు ద్వారా ఈ ప్రాంత రైతులకు ప్రయోజనం కల్పించేందుకు కార్యవర్గం ప్రయత్నించాలన్నారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో చైర్మన్ మణిచంద్రప్రకాష్‌తో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కార్యక్రమంలో రైల్వే బోర్డు మెంబర్ శ్రీనివాసరౌళో, జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, బాసుదేవ్ రౌళో, బి.చిన్నబాబు, బి.రమేష్, పి.కృష్ణారావు, బాసుదేవ్ ప్రధా న్, ఇచ్చాపురం, కంచిలి, సోంపేట కూటమి నేతలు పాల్గొన్నారు.