ఆలయ అభివృద్ధికి పాటుపడాలి
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:05 AM
ఆలయ అభివృద్ధికి పాలకమండలి సభ్యులు పాటుపడాలని ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. నగరంలోని చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం బుధవారం నిర్వహించారు.
ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆలయ అభివృద్ధికి పాలకమండలి సభ్యులు పాటుపడాలని ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. నగరంలోని చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆలయాల కమిటీల నియామకం పారద ర్శకంగా జరుగుతున్నాయన్నారు. హిందూ దేవాలయాలు సనాతన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలని వాటి ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పాలక మండలి అధ్యక్షుడిగా పాండ్రంకి దేవేంద్రనాయుడు, సభ్యులుగా బెహరా శ్రీదేవి, కోరాడ రమేష్, కటారి అరుణ, పొదిలాపు అమరవాణి, కొండ్ర అరుణలతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఈవో మునగవలస సుకన్య, ప్రధాన అర్చకుడు ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ, టీడీపీ నాయకులు పాండ్రంకి శంకర్, నాగేంద్ర పాల్గొన్నారు.
దుర్గాదేవి ఆలయంలో..
బ్రిడ్జిరోడ్డు సమీపంలోని దుర్గామాత ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం బుధవారం జరిగింది. అధ్యక్షుడిగా మచ్చ బుచ్చిబాబు, సభ్యులుగా సకలాభక్తుల శ్రీనివాస్, ఎ.మల్లికార్జున, శివకోటి సరళ, మచ్చ జయ దుర్గ, పీవీ అప్పలసూర్యనారాయణ, అలసంగి తేజేశ్వరి ప్రమాణం చేశారు. వీరిని ఎమ్మెల్యే శంకర్ అభినందించారు. కార్యక్రమం లో ఈవో సన్యాసిరావు, బీజేపీ ప్రతినిధులు డబ్బీరు సోమే శ్వరరావు, శవ్వాన ఉమామహేశ్వరి, సరళ, రంగలక్ష్మి, సురేష్ సింగ్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.