Share News

సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాలి

ABN , Publish Date - Sep 12 , 2025 | 11:33 PM

జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేం దుకు కృషి చేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ సుధాకరరావు అన్నారు.

సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాలి
మాట్లాడుతున్న డ్వామా పీడీ సుధాకరరావు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, సెప్టెంబరు 12(ఆంధ్ర జ్యోతి): జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేం దుకు కృషి చేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ సుధాకరరావు అన్నారు. స్థానిక మహిళా సమాఖ్య కార్యవర్గ సమావేశ మందిరంలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యం లో శుక్రవారం ‘ఉల్లాస్‌’పై వలంటీర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శిక్షణ ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడం, వారికి సం ఖ్యాశాస్త్రం, ఇతర జీవన నైపుణ్యా లను అందించాలన్నారు. వయోజన విద్య ఏడీ సోమేశ్వ రరావు మాట్లాడుతూ.. 11,207 మంది వలంటీర్లకు శిక్షణ నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో శిక్షణ ఇచ్చి, 1,12,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిది ద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎల్‌డీవో చంద్ర కుమారి, కె.వెంకట రమణ, పి.వెంకటరమణ, బాలచంద్ర, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 11:33 PM