Share News

రైతులకు అండగా నిలవాలి: ఎమ్మెల్యే అశోక్‌

ABN , Publish Date - Jul 18 , 2025 | 11:35 PM

రైతులకు ఎటువంటి నష్టం వాటిల్ల కుండా పాలకవర్గ సభ్యులు అండగా నిలవాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు.

రైతులకు అండగా నిలవాలి: ఎమ్మెల్యే అశోక్‌
ఇచ్ఛాపురం: సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

ఇచ్ఛాపురం, జూలై 18(ఆంధ్రజ్యోతి): రైతులకు ఎటువంటి నష్టం వాటిల్ల కుండా పాలకవర్గ సభ్యులు అండగా నిలవాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. శుక్రవారం పీఏసీఎస్‌ కార్యాలయ ఆవరణలో పీఏసీఎస్‌ చైర్మన్‌గా పెదిని బాబ్జీ, డైరెక్టర్లుగా గిన్ని బలరాజు, బాసి భారతి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎరువుల కొరత రానీయ కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు, టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు సత్రి తవిటయ్య, లోపింటి పద్మనాభం, నాయకులు మేరుగు సూర్య నారాయణ, దూపాన సూర్యనారా యణ, దక్కత డిల్లీరావు, కామేష్‌, సబ్‌ డివిజనల్‌ కోపరేటివ్‌ అధికారి ఎల్‌.పాపారావు, డీసీసీబీ మేనేజర్‌ అనితా పండా, పీఏసీఎస్‌ సీఈవో భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.

అవినీతికి దూరంగా ఉండాలి

కంచిలి, జూలై 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో కంచిలి పీఏసీఎస్‌లో సుమారు రూ.20 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న సభ్యులు మరింత జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ సూచించారు. కంచిలి పీఏసీఎస్‌ కార్యాలయ ఆవరణలో శుక్రవారం పీఏసీఎస్‌ అధ్యక్షుడు పైల పురుషోత్తం రెడ్డి, డైరెక్టర్లు కిషోర్‌కుమర్‌ పాడీ, డొక్కరి మహాలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేస్తున్న విత్తనాలు, ఎరువులు రైతులకు సక్రమంగా అందిస్తూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలన్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, కూటమి నాయకులు మాదిన రామారావు, జగదీష్‌ పట్నాయక్‌, బంగారు కురయ్య, డొక్కరి ఈశ్వరరావు, పైల రామారావు, తమరాల శోభన్‌, టీవీ రమణ, ఎం.పూర్ణ, పూర్ణచంద్ర బిసోయ్‌, ఎస్‌.కామేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 11:35 PM