సారారహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:33 PM
సారా తయారుచేస్తున్న గ్రా మాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సారారహిత గ్రామా లుగా తీర్చిదిద్దాలని ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
సోంపేట, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): సారా తయారుచేస్తున్న గ్రా మాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సారారహిత గ్రామా లుగా తీర్చిదిద్దాలని ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నవోదయం-2లో భాగంగా సారా తయారీ దారులపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు.బుధవారం సోంపేట స్టేషన్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మురళీధర్, సోంపేట, పలాస సీఐలు జీవీ రమణ, ఐ.మల్లిఖార్జునరావు, టాస్క్‌ఫోర్స్ సీఐ మధు, ఎస్‌ఐలు కళ్యాణి, సూజత సిబ్బంది ఉన్నారు.