Share News

పాత నేరస్థులపై నిఘాపెట్టాలి: ఎస్పీ

ABN , Publish Date - Jun 29 , 2025 | 12:01 AM

: ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బీట్‌ సిస్టమ్‌ను పటిష్టంగా అమలుచేసి సెస్పెక్ట్‌, రౌడీషీటర్లు, పాత నేరస్థులపై నిరంతరం నిఘా పెట్టాలని పోలీస్‌ అధికారులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.

  పాత నేరస్థులపై నిఘాపెట్టాలి: ఎస్పీ
మాట్లాడుతున్న మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బీట్‌ సిస్టమ్‌ను పటిష్టంగా అమలుచేసి సెస్పెక్ట్‌, రౌడీషీటర్లు, పాత నేరస్థులపై నిరంతరం నిఘా పెట్టాలని పోలీస్‌ అధికారులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.శనివారం శ్రీకాకుళంలో పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదులు, బీట్‌ సిస్టం అమలు, విజిబుల్‌ పోలీ సింగ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వర్క్స్‌,సంకల్పం, నాన్‌ బె యిల్‌బుల్‌ వారెంట్లు, ముఖ్యమైన గ్రేవ్‌ కేసులు దర్యాప్తు, అరెస్టు, ప్రాపర్టీసిజ్‌ తదితర అంశా లపై ఎస్పీ నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పబ్లిక్‌ గ్రీవెన్స్‌లో వచ్చే ఫిర్యాదులపై నిర్లక్ష్యం లేకుండా పరిష్కరించాలని కోరారు.నాన్‌ బెయిల్‌వారెంట్స్‌ వీలైనంత వరకు అమలు చేసి న్యాయస్థానంలో హాజరుపరాచాలనికోరారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల్లో పారదర్శ కంగా దర్యాప్తు పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. కాగా ప్రాపర్టీ కేసులు, ప్రాపర్టీ రివకరీ, ముద్దాయిలు అరెస్టు, చాకచక్యంగా చేధించడం, ముఖ్యమైన కేసుల్లో ప్రతిభ చూపిన టౌన్‌ సీఐ పైడిపునాయుడు, సీసీఎస్‌ సీఐ సూర్యచంద్రమౌళి, పాతపట్నం సీఐ రామా రావు, సైబర్‌సెల్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐలు హరికృష్ణ, రాము, మధుసూదన్‌, గోపూర్‌, హెచ్‌సీ,కానిస్టేబుల్‌ వారికి ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందించారు. సమా వేశంలో అదనపు ఎస్పీలు కేవీ రమణ, పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు వివేకానంద, అప్పారావు, ప్రసాదరావు, ఏవో గోపీనాధ్‌, ఎస్‌బీ సీఐ ఇమ్మన్యుల్‌ రాజు, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 12:01 AM