Share News

జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలి: అశోక్‌

ABN , Publish Date - Aug 30 , 2025 | 11:20 PM

జాతీయ స్థాయి ఖోఖో పోటీ ల్లోనూ రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు.

జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలి: అశోక్‌
విద్యార్థినులను అభినందిస్తున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

ఇచ్ఛాపురం, ఆగస్టు 30(ఆంధ్రజ్రోతి): జాతీయ స్థాయి ఖోఖో పోటీ ల్లోనూ రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన అమరావతి చాంపియన్‌షిప్‌ రాష్ట్రస్ధాయి ఖోఖో పోటీల్లో స్థానిక బాలికోన్నత పాఠ శాల విద్యార్థినులు రన్నర్‌గా నిలిచి కప్‌ పొందారు. విశాఖ ఏయూ కాన్ఫ రెన్స్‌ హాలులో మంత్రి నారా లోకేష్‌ వీరిని అభినందించి రూ.50 వేలు నగదు పురస్కారం అందించారు. ఈ సందర్భంగా శనివారం రామయ్య పుట్టగలో విద్యార్థులను ఎమ్మెల్యే అశోక్‌ అభినందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీనివాసరావు, పీఈటీ లత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాలికోన్నత పాఠశాలలో జరిగిన అభినందన సభలో ఖోఖో విజేతలకు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి పి.ఫరీష్‌ కుమార్‌ అభినందించారు.

Updated Date - Aug 30 , 2025 | 11:20 PM