రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:56 PM
పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన దారులు నిబంధనలను పాటించాలని ట్రాఫిక్ ఎస్‌ఐ మెట్ట సుధాకర్ అన్నారు.
పాత శ్రీకాకుళం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన దారులు నిబంధనలను పాటించాలని ట్రాఫిక్ ఎస్‌ఐ మెట్ట సుధాకర్ అన్నారు. శనివారం పాత బస్టాండ్ వద్ద వాహనదారులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల నుంచి బయటపడవచ్చన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించాలని, ఓవర్ స్పీడ్‌తో వెళ్లరాదన్నారు. మొబైల్‌లో మాట్లాడుతూ వాహనం నడిపినా, మద్యం సేవించి డ్రైవింగ్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న చలానాలు ఆన్‌లైన్‌లో తెలుసుకోవడం, ఫోన్ పేలో చలానా చెల్లించే విధానాన్ని ట్రాఫిక్ సిబ్బంది వివరించారు. అనేక మంది వాహనదారులు పెండింగ్ చలానాలు చెల్లించినట్లు సుధాకర్ తెలిపారు. సిబ్బంది పాల్గొన్నారు.