Share News

పారిశుధ్య నిర్వహణకు సహకరించాలి: సీఈవో

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:53 PM

పారిశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలని, ఇంట్లో తడి, పొడి చెత్త వేరుచేయాలని జడ్పీ సీఈవో శ్రీధర్‌రాజా కోరారు.

 పారిశుధ్య నిర్వహణకు   సహకరించాలి:  సీఈవో
మడపాంలో తడి, పొడిచెత్త వేరుచేసే విధానంపై కరపత్రాలను పంపిణీ చేస్తున్న జెడ్పీ సీఈవో శ్రీధర్‌రాజా

నరసన్నపేట, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): పారిశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలని, ఇంట్లో తడి, పొడి చెత్త వేరుచేయాలని జడ్పీ సీఈవో శ్రీధర్‌రాజా కోరారు. సోమవారం మడపాంలో తడి, పొడిచెత్త వేరుచేసిన విధానం- పరిసరాలు పరిశుభ్రతపై కరపత్రాలు పంపిణీచేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర ప్రసాద్‌, డిప్యూటీ ఎంపీడీవో రేణుక, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 11:53 PM