వికసిత్ భారత్‌లో భాగస్వామ్యం కావాలి
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:30 PM
వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యేలు నడుకుదిటి ఈశ్వరరావు, మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు.
- ఎమ్మెల్యేలు ఈశ్వరరావు, గోవిందరావు
పాతపట్నం, నవంబరు25 (ఆంధ్రజ్యోతి): వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యేలు నడుకుదిటి ఈశ్వరరావు, మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు. మేరా యువభారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాతపట్నంలో జాతీయ సమైక్యతా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. నీలమణి దుర్గ ఆలయం నుంచి పాతపట్నం కేఎస్‌ఎం ప్లాజా కూడలివరకూ ర్యాలీ సాగింది. దారిపొడవునా ఉన్న జాతీయనాయకులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరంక ఏఎస్‌ఎం ప్లాజాలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడారు. నేటి యువత ధనార్జనే లక్ష్యంగా విదేశాలకు వెళ్లకుండా, స్వదేశానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మేరా యువభారత్ డిప్యూటీ డైరెక్టర్ కె.వెంకట్‌ఉజ్వల్, గణంకాధికారి డి.శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, అంబేడ్కర్ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా పోగ్రాం కోఆర్డినే టర్ దంతులూరి వనజ, సీఐ ఎన్.సన్యాసినాయుడు ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ కె.చక్రపతి, ఎన్‌ఎస్‌ఎస్ జాతీయ అవార్డ్‌గ్రహీత ఆర్.లీలాప్రసాద్, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.